E.G: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ విమర్శించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేసిన వంచనలను వివరించారు.