AKP: కోటవురట్ల మండల సర్వసభ్య సమావేశం ఈనెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం పదిన్నర గంటలకు ఎంపీపీ అప్పలనాయుడు అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. ఈ మేరకు ఎంపీటీసీలకు ఆహ్వానాలు పంపించామన్నారు. మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని కోరారు.