VSP: ఆనందపురం పోలీస్ స్టేషన్ ఏఎస్సై చల్లా సింహాచలం మంగళవారం ఉదయం గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. మధురవాడ, నగరంపాలెం రోడ్ నివాసి అయిన ఆయన, ప్రస్తుతం ఐటీ సెజ్ శక్తి టీమ్ ఇంఛార్జ్‌గా విధులలో ఉన్నారు. గత వారం రోజులుగా సెలవులో ఉన్న ఆయనకు ఈ ఉదయం ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యం (గుండెపోటు) రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.