BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారిణి (డీఈవో)గా డి. వాసంతి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. విద్యాశాఖ అధికారులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జిల్లాలో విద్యా ప్రమాణాల పెంపు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని తెలిపారు.