విశాఖ ఉమ్మడి జిల్లాల జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు ఈ నెల 15న జరగనున్నాయి. జడ్పీ ఛైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షత వహించనున్నట్టు జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి ఇవాళ తెలిపారు. జడ్పీ సమావేశ మందిరం, వి.సి. హాలులో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 1 నుంచి 7 వరకు గల స్థాయీ సంఘాల సమావేశాలు వేర్వేరు సమయాల్లో జరుగుతాయన్నారు.