VKB: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే తీవ్రమైన ఎండ వేడిమి ఉండటంతో మధ్యాహ్నానికి ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరుకుంది. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు వడదెబ్బ భయంతో వణికిపోతున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీరు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అనవసరంగా బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.