ATP: జిల్లా డీఈవో ప్రసాద్ బాబు గుండె సంబంధిత సమస్యతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ప్రసాద్ బాబు 15 రోజులు సెలవులో వెళ్లడంతో, ఇన్ఛార్జి డీఈవోగా శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు. ఆయన త్వరగా కోలుకోవాలని విద్యాశాఖ సిబ్బంది ఆకాంక్షించారు.