మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఎన్నికల ప్రయోజనాల కోసమే నిర్వహిస్తున్నారని తెలిపారు. బెంగాల్, తమిళనాడు ఎన్నికలు ఉన్నాయనే.. మహిళా రిజర్వేషన్ల బిల్లు తెచ్చారని వెల్లడించారు. ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ఏదైనా చేస్తుందని చెప్పారు.