నల్గొండ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్‌ను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తిని లక్ష్మారెడ్డి, మేయర్ బుర్రి చైతన్యతో కలిసి సందర్శించారు. చెత్త రీసైక్లింగ్ మిషనరీ పనితీరు, నిర్వహణ ఖర్చు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే మిర్యాలగూడ డంపింగ్ యార్డ్‌లోనూ ఇలాంటి టెక్నాలజీతో చెత్తను రీసైకిల్ చేసి, పట్టణాన్ని క్లీన్‌గా తీర్చిదిద్దుతామని MLA వెల్లడించారు.