WNP: యువత మాదకద్రవ్యాల వైపు మల్లకుండా భవిష్యత్తుపై దృష్టి సారించి చక్కగా చదువుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా డ్రగ్స్‌ను నిర్మూలిద్దాం అనే కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.