PDPL: ఇవాళ ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ధర్మారం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 43.7%, ప్రథమ సంవత్సరం 25% విద్యార్థులు ఉత్తీర్ణత పొందారని ప్రిన్సిపాల్ అనంత రామకృష్ణ తెలిపారు. ప్రథమ సంవత్సరం చొప్పదండి అనిల్ కుమార్ (C.E.C) 472/500, ద్వితీయ సంవత్సరం E. ఝాన్సీ రాణి (B.P.C) 802/1000 టాపర్గా నిలిచారని పేర్కొన్నారు.