WNP: కోటిలింగేశ్వర దేవస్థానంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలు, గంధ జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు చేశారు. జిల్లేడు పూలు, మారేడు దళాలతో అలంకరించి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. ఆలయ కమిటీ భక్తులకు అల్పాహార సౌకర్యం కల్పించింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.