భూపాలపల్లి జిల్లా పెద్దాపూర్ గ్రామంలో నల్ల పోచమ్మ, పోత లింగన్న విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. పెద్దాపూర్ గ్రామ సమగ్ర అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని చెప్పారు.