MLG: కోయగూడ గ్రామ పంచాయతీలోని రాంనగర్ గ్రామంలో ప్రజలకు ఎండాకాలంలో స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సర్పంచ్ పోరిక సరిత అన్నారు. గోదావరి రోడ్డు వద్ద గేటు వాల్ వద్ద చేపడుతున్న మరమ్మతు పనులను సర్పంచ్ పరిశీలించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు.