GDWL: మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అల్వాల శిరీష రాజశేఖర్ రెడ్డి పంచాయతీ కార్యాలయం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామ విద్యార్థులను సర్పంచ్ సన్మానించి అభినందించారు.