TG: నిర్మల్ జిల్లాలో పర్యటించిన డీజీపీ శివధర్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, ‘భరోసా’ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుళ్లకు ప్రశంసా పత్రాలు ఇచ్చారు. ముఖ్యంగా ‘పోలీస్ అక్క’ కార్యక్రమంపై ప్రశంసలు కురిపించిన ఆయన, త్వరలోనే ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో అమలు చేస్తామని స్పష్టం చేశారు.