SRPT: మునగాల మండలం గణపవరం గ్రామపంచాయతీలో ఇవాళ డాక్టర్ బీఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ అమరబోయిన మట్టయ్య నివాళులర్పించి మాట్లాడుతూ.. అంటరానితనంపై పోరాడి మహిళలు, దళితుల హక్కుల కోసం కృషి చేసిన అంబేద్కర్, పేదల పాలిట ఆశాజ్యోతి అని కొనియాడారు. మతం కన్నా మానవత్వమే గొప్పదని చాటిన ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు.