MBNR: జిల్లాలో మాతృ మరణాల సమీక్ష నిర్వహించిన కలెక్టర్ ఖుష్బూ గుప్తా, గర్భిణీలకు సమయానుకూల వైద్యం అందించాలని ఆదేశించారు. హై రిస్క్ గర్భిణీల ముందస్తు గుర్తింపు, 24/7 ప్రసూతి సేవలు, వేగవంతమైన రిఫరల్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. మాతృ మరణాలు సంభవించకుండా వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.