KMM : మధిర విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం వద్ద కార్మికుల సమ్మె ఇవాళ ఐదో రోజుకు చేరింది. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోరుతూ ఆర్టిజన్స్, అన్మ్యాన్, పీస్ రేట్ కార్మికులు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. సబ్ స్టేషన్, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని కార్మికులు తెలిపారు.