TG: డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ను ఇవాళ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రకటించారు. మూడు విడతల్లో సీట్ల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎల్లుండి నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, వారం తర్వాత నుంచి వెబ్ ఆప్షన్లు ఉంటాయని వెల్లడించారు. కాగా నిన్న ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.