KNR: హుజూరాబాద్ పట్టణంలోని జమ్మికుంట రహదారిపై ఆదివారం పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న ఓ కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్తంభం విరిగి కారుపై పడడంతో వాహనం తీవ్రంగా దెబ్బతింది. అదృష్టవశాత్తు ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో డ్రైవర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.