HYD: బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చినా ఎలాంటి ప్రయోజనం లేదని ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ.. BRSకు తెలంగాణ ప్రజలు ఎప్పుడో వీఆర్ఎస్ ఇచ్చేశారన్నారు. కల్వకుంట్ల కుటుంబం అంటేనే కుట్రల కుటుంబం అన్నారు. పడేళ్లు తెలంగాణ అమరులను, ప్రజాసంఘాలను, ఉద్యోగ సంఘాలను గోస పెట్టారని ధ్వజమెత్తారు.