MDK: రామాయంపేట మండల కేంద్రంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని తహసీల్దార్ రజనీకుమారి తెలిపారు. సోమవారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు 5 కేంద్రాల్లో 816 మంది విద్యార్థులకు గాను 814 మంది హాజరయ్యారని, ఇద్దరు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పక్కా ఏర్పాట్లతో పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని, విధుల్లో సహకరించిన సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.