GDWL: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. సోమవారం గద్వాల శారద పాఠశాల కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన, జవాబు పత్రాలను భద్రంగా పోలీస్ ఎస్కార్ట్‌లో డిపాజిట్ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, పరీక్షల నిర్వహణ విజయవంతమైందని కలెక్టర్ పేర్కొన్నారు.