KMR: దోమకొండకు చెందిన బ్రహ్మయ్యగారి వెంకవ్వ (70) అనే వృద్ధురాలు కుక్కకాటుతో మృతి చెందారు. 15 రోజుల క్రితం కుక్క కరవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె, సోమవారం పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామంలో విచ్చలవిడిగా తిరుగుతున్న పిచ్చి కుక్కల బెడదను అరికట్టాలని, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.