NZB: కమ్మర్ పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులను ఆదివారం సాయంత్రం MLA ప్రశాంత్ రెడ్డి అభినందించారు. గ్రామాభివృద్ధికి గ్రామస్థాయి కమిటీల పాత్ర కీలకమని అన్నారు. గ్రామంలోని ఆచారాలు, సంప్రదాయాలు సమన్వయంతో నిర్వహించేందుకు ఈ కమిటీలు ఉపయోగపడతాయని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని MLA హామీ ఇచ్చారు.