GNTR: భవన నిర్మాణ కార్మికులు సమీప కార్మికశాఖ కార్యాలయాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ సూచించారు. 18-60 ఏళ్ల మధ్య వయస్సు గల వారు తప్పనిసరిగా నమోదు చేసి గుర్తింపు కార్డు పొందాలన్నారు. పథకాల ప్రయోజనాలు: వివాహానికి రూ.20వేలు, ప్రసూతికి రూ.20వేలు, సహజ మరణానికి రూ.60వేలు, అంత్యక్రియలకు రూ.20వేలు అందిస్తారు అన్నారు.