KNR: హిందూ సమాజం ఐక్యంగా ఉన్నప్పుడే దేశం, ధర్మం సుస్థిరంగా ఉంటాయని ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్ సి.ఏ నిరంజనా చారి పేర్కొన్నారు. కరీంనగర్ జ్యోతినగర్లో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య వక్తగా మాట్లాడారు. కులాల విభజనతో హిందూత్వానికి నష్టం వాటిల్లుతుందని, ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నటి పూనమ్ కౌర్, పాల్గొన్నారు.