KDP: వల్లూరు మండలం పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం అన్నదానం వద్ద భోజనం చేసిన మైదుకూరుకు చెందిన సుబ్బమ్మ (70) గుండె నొప్పితో మరణించారు. తీవ్ర ఎండల వల్ల వడదెబ్బ తగిలి ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. ఎస్సై శివ నాగిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్‌కు, మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.