ADB: జిల్లాలోని దస్నాపూర్లో కోళ్ల దొంగతనం కేసును మావల పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. రాత్రి సమయంలో కొందరు దుండగులు షాప్ వెనుక భాగంలో టిన్ షీట్లు కట్ చేసి లోపలికి ప్రవేశించి సుమారు 4 క్వింటాళ్ల కోళ్లను ఎత్తుకెళ్లారు. సుగుణ చికెన్ సెంటర్ యజమాని సంజీవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.