పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన ప్రసాద్దాస్ పంతులు ఓ బాలికతో అనుచితంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, సహచర కార్మికులు అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా, గాయమడిన నిందితుడిని చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.