AKP: తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఎస్ రాయవరం మండలం పెదగుమ్ములూరు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం సుధా మాధురి విజ్ఞప్తి చేశారు. సోమవారం గ్రామంలో బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించారు. అర్హులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నట్లు తెలిపారు.