NDL: శ్రీశైలం – దోర్నాల ఘాట్ రోడ్డులోని అభయ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. భక్తులు వదిలిన కొబ్బరికాయల కోసం ఇవి తరచుగా ఆలయాల్లోకి ప్రవేశిస్తున్నాయి. రాత్రి వేళల్లో వన్యమృగాల సంచారం పెరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా అడవి జంతువులకు అటవీశాఖ అధికారులు తాగునీటి వసతి కల్పించాలని స్థానికులు కోరారు.