ELR: జిలుగుమిల్లీలో గిరిజన సంక్షేమ పాఠశాలలో చిన్నారులకి, మహిళలకి వారి భద్రతపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై క్రాంతి కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, మొబైల్ ఫోన్ మరియు సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.మైనర్ బాలికల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.