KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 సచివాలయం సమీపం వద్ద గత 5 నెలల నుంచి తాగునీటి పైపు పగిలిపోవడంతో భారీగా నీరు వృథా అవుతుంది. ఈ విషయంపై పలుమార్లు పంచాయతీ సెక్రటరీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే పైపు మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.