KDP: మైదుకూరు పట్టణంలోని వివిధ లాడ్జిలపై సోమవారం తెల్లవారుజామున పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు, రికార్డులను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని యజమానులు, సిబ్బందికి సూచించారు. ఆధార్ కార్డు, వ్యక్తుల చిరునామాలు తప్పక నమోదు చేయాలని సూచించారు. అసాంఘిక చర్యలకు పాల్పడితే తీవ్రపరిణామాలు ఉంటాయన్నారు.