TG: HYD మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై ఓ బెంజ్ కారు ఢీకొట్టడంతో శ్యామ్ రాజ్(32) అనే వ్యక్తి మృతిచెందాడు. జూబ్లీ హిల్స్ నుంచి ఐకియా వైపు వస్తున్న WB 06B 7003 కారు.. బ్రిడ్జిపై ఆగి ఉన్న శ్యామ్ రాజ్‌ను ఢీకొట్టింది. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ పరారయ్యాడు. ఘటనలో కారు ఇంజన్ భాగం దెబ్బతిన్నట్లు గుర్తించారు.