NDL: దొంగతనం బయటపడటం, పాత కేసుల అవమాన భారంతోనే తన భర్త వెంకటసుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య లక్ష్మి వెల్లడించారు. ఆదివారం రాత్రి అవుకు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటనకు పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోస్టుమార్టం అనంతరం కుమారుడు సుమంత్‌తో కలిసి ఆమె ఈ వివరాలు తెలిపారు.