AP: ప్రభుత్వ సర్వీస్ నుండి తనను తొలగించడంపై సచివాలయ సంఘం మాజీ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం తనపై అడ్డగోలుగా వేటు వేసిందని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. గత ఎన్నికల్లో తాను వైసీపీకి ప్రచారం చేశాననడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఉద్యోగులెవరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదనే ఉద్దేశంతోనే తనను బలిచేశారని ఆరోపించారు.