WNP: సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పరిసరాల పరిశుభ్రత పాటించాలని అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా అధికారులు అందరూ వారికి నిర్దేశించిన సంక్షేమ వసతి గృహాలను సందర్శించారు. అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.