NGKL: కోడేరు ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించేందుకు సిద్ధమైనట్లు ఎంపీడీవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం నుంచి మండలంలోని 16 పంచాయతీలలో పనులు ముమ్మరం చేయాలని, ప్రతి ఊరిలో గరిష్ఠంగా 100 మంది కూలీలు ఉండేలా చూడాలని సిబ్బందికి సూచించారు. జిల్లా యంత్రాంగం ఆదేశాల ప్రకారం పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకూడదని తెలిపారు.