MDCL: తార్నాకలోని మెట్రో పార్కింగ్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం 4 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఈ సదుపాయంతో ఈవీ వాహనదారులు సులభంగా తమ వాహనాలను ఛార్జ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. నగరంలో గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడమే లక్ష్యంగా మెట్రో అధికారులు ఈ చర్యలు చేపడుతున్నారు. దీంతో పర్యావరణ హిత రవాణా వినియోగం మరింత పెరగనుంది.