AP: చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రియమైన శ్రీవారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి పుట్టుకకు ఒక కారణం ఉందంటారు. ఆయన పుట్టింది తెలుగు ప్రజల కోసం. బర్త్ డే వేడుకల కంటే ప్రజా సేవలోనే ఆయనకు ఎక్కువ ఆనందం. అంత ఇష్టమైన ప్రజల కోసం నిండు నూరేళ్లూ ఉత్సాహంతో, సంపూర్ణ శక్తితో, ఆరోగ్యంతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.