GNTR: జిల్లాలో సింగిల్ నంబర్ లాటరీ మోసాలు పెరిగాయి. కోటీశ్వరులు కావచ్చని ఆశచూపి కూలీలు, ఆటో డ్రైవర్లను బురిడీ కొట్టిస్తున్నారు. ఆన్లైన్లో రూ.40 నుంచి రూ.1500వరకు టికెట్లు అమ్ముతున్నారు. తీరా ఎవరూ కొనని నంబర్లనే విన్నర్లుగా ప్రకటిస్తూ పక్కాగా దోచుకుంటున్నారు. సామాన్యులను ముంచుతున్న ఈ ముఠాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Tags :