VKB: దోమ మండల పరిధిలోని కిష్టాపూర్లో తెలంగాణ ఉద్యమకారుల సన్మాన సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కార్యదర్శి పోరాటాల రామన్న మాట్లాడుతూ.. పరిగి నియోజకవర్గవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఇలాంటి సభలు నిర్వహిస్తామని తెలిపారు. కులమతాలకు అతీతంగా, అగ్రవర్ణ పేదలను కలుపుకొని గ్రామస్థాయి నుంచి సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.