W.G: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మూగజీవాల సంరక్షణ కోసం నీటి తొట్టెలను పంపిణీ చేయడం చాలా అభినందనీయమని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. ఆదివారం నరసాపురంలో ఓ సంస్థ ఆధ్వర్యంలో నీటి తొట్టెలను పంపిణీ కార్యక్రమంలో కొత్తపల్లి పాల్గొని మాట్లాడారు. ప్రధాన కూడళ్లు, రహదారుల వెంబడి ఈ నీటి తొట్టెలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.