MDK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రుస్తుంపేటలో యువతకు రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎస్ఐ రంజిత్ రెడ్డి చేతుల మీదుగా యువతకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం హెల్మెట్లు ధరించి గ్రామంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. రహదారి నిబంధనలు పాటించి ప్రాణ రక్షణ పొందాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, అధికారులు పాల్గొన్నారు.