BHNG: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ సంయుక్తంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ రామన్నపేట మండలం జనంపల్లిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని ప్రసంగించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు.