ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని MLA పాయల్ శంకర్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శివధర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు అందజేస్తున్న పోలీస్ సేవలు, పలు అంశాలపై డీజీపీతో చర్చించినట్లు ఎమ్మెల్యే పాయల శంకర్ పేర్కొన్నారు.