NLG: నార్కెట్పల్లి మండలంలోని కంపెనీల్లో స్థానిక యువతకు 70 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువమోర్చా మండల ఉపాధ్యక్షుడు యాట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో MROకు వినతిపత్రం అందజేశారు. అర్హత గల వారికి ఉన్నత స్థాయి ఉద్యోగాల్లోనూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దీనిపై ఎంఆర్వో స్పందిస్తూ, సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.